- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. ఢిల్లీలో కీలక సమావేశం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. స్క్రినింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి, భట్టి విక్రమార్క, జిగ్నేశ్ మేహావని, బాబా సిద్ధిక్ పాల్గొన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాదిలో ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే తెలంగాణలో పోటీ చేసేందుకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకోగా పలుచోట్ల ఒక్కరు మాత్రమే ఆసక్తి చూపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి పైగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్కీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.