- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శం : మంత్రి కోమటిరెడ్డి
దిశ, చార్మినార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శం అని రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిజామాబాద్ కు చెందిన ఉపాధ్యాయులు రుద్రంగి రమేష్ మేరు కుల గణన పై ప్రత్యేకంగా రచించి,రూపొందించిన గీతాన్ని, సిడిని మంత్రి సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను భవిష్యత్తులో దేశం మొత్తం రోల్ మోడల్ గా తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను అడ్డుకునేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు,రాష్ట్ర మేరు సంఘం నాయకులు కె.వెంకటేష్,కీర్తి రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.