1200 మంది ప్రాణత్యాగాల ముందు.. నీ కుటుంబ త్యాగమెంత? కేసీఆర్‌పై బీజేపీ ఫైర్

by Satheesh |   ( Updated:2023-05-30 13:14:32.0  )
1200 మంది ప్రాణత్యాగాల ముందు.. నీ కుటుంబ త్యాగమెంత? కేసీఆర్‌పై బీజేపీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెంలగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యమకారులను ఏనాడు పట్టించుకోని కేసీఆర్ ఇవాళ దశాబ్ది ఉత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. 1200 మంది ప్రాణత్యాగాల ముందు నీ కుటుంబం చేసిన త్యాగం ఎంత అని నిలదీస్తూ టీబీజేపీ మంగళవారం ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించింది. ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగ హామీ ఎటు పోయింది? ఉద్యమకారుల కుటుంబాలకు ఇస్తామన్న భూమి ఎటుపోయింది? 9 ఏళ్లుగా ప్రగతి భవన్‌లోకి అనుమతి లేకుండా చేసింది ఎవరని నిలదీసింది.

కేసీఆర్ చేసే పనికి అమరుల ఆత్మక్షోభిస్తోందని ధ్వజమెత్తింది. కేసీఆర్ దగాకోరు పాలనలో తెలంగాణ రైతు సంక్షోభ సుడిగుండంలో విలవిలలాడుతోందని.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోగా ధాన్యం అమ్మకం సమయంలో తేమ, తరుగు పేరుతో రైతుల్ని దగా చేస్తోందని మండిపడింది. సమగ్ర పంటబీమా పథకం రూపకల్పనకు 9 ఏళ్లు సరిపోదా అని ప్రశ్నించింది. యాసంగి పంటకు పంగనామాలు పెట్టిన దగాకోరు కేసీఆర్ ఘాటు విమర్శలు చేసింది.

Also Read..

‘‘అది మనందరి బాధ్యత’’.. పర్యాటకులకు మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి

కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం: మాజీ మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story