- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో కాంగ్రెస్‌ను ఖతం చేయాలి: ఓటర్లకు బండి సంజయ్ కీలక విజ్ఞప్తి
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిన డబ్బులనే కాంగ్రెస్ పంచుతోందని, ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన సంజయ్ గురువారం గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.
బాగేపల్లిలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, అసెంబ్లీ అభ్యర్థి మునిరాజుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీ దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తిరుగుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. భవిష్యత్‌లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. పాకిస్తాన్ వెళ్లి ప్రచారం చేస్తారేమోనని సంజయ్ ఎద్దేవా చేశారు.
వచ్చేనెల 10న జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ బాక్స్ బద్దలయ్యేలా కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ఇక్కడి స్థానికులు బీజేపీకి ఓటేయకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులిస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కరోనా టైంలో ఇంటికి పరిమితమైతే బీజేపీ అభ్యర్థి మునిరాజు సేవ చేశాని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఓటుకు రూ.10 వేల పంచేందుకు సిద్ధమైందని, అవన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ పంపినవేనని, ఒక్క పైసా తక్కువిచ్చినా ప్రజలు ఊరుకోవద్దని, ఓటు మాత్రం బీజేపీకి వేసి కాంగ్రెస్‌ను ఖతం చేయలాని విజ్ఞప్తి చేశారు. మొన్నటిదాకా జేడీఎస్‌కు పైసలిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసేసరికి కాంగ్రెస్‌కు డబ్బులు పంపిస్తున్నాడని బండి ఆరోపించారు.
కుమారస్వామి ఫోన్ చేసినా కేసీఆర్ లిఫ్ట్ చేయడంలేదని తెలిపారు. కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలో లేదని, పొరపాటున ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని సంజయ్ చెప్పారు. బాగేపల్లిలో సమస్యలపై ప్రశ్నేంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయడంతో పాటు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 5 నుంచి 7 శాతానికి పెంచిన ఘనత బీజేపీదేనని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టులను గెలిపిస్తే బార్, బీర్ తప్ప ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఏముందని సంజయ్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న సంజయ్‌కి ఘన స్వాగతం లభించింది. ఆయన్ను కర్ణాటక ఎస్సీ మోర్చా నేతలు ఘనంగా సన్మానించారు. ప్రచారంలో భాగంగా సంజయ్ రోడ్ షో చేపట్టగా బండి సంజయ్ జిందాబాద్.. జై బీజేపీ అనే నినాదాలు మార్మోగాయి. సంజయ్‌కి అపూర్వ స్పందన లభించింది.