Mahesh Babu: ఆ స్పెషల్ డే రోజున రీ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న మహేష్ బాబు డిజాస్టర్ సినిమా

by Prasanna |
Mahesh Babu: ఆ స్పెషల్ డే రోజున రీ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న మహేష్ బాబు డిజాస్టర్ సినిమా
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ( Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2007లో విడుదలైన " అతిధి " ( Athidhi) సినిమా ఇప్పుడు రీరిలీజ్‌కి సిద్ధమవుతోంది. కమర్షియల్‌గా ఈ మూవీ ఫ్లాప్ అయినా.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఫ్యాన్స్ అతుక్కుపోతారు. ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వాలెంటైన్స్ డే రోజున.. ఫిబ్రవరి 14న ఈ మూవీ రీ రిలీజ్‌కు అవ్వనుంది. 4K వెర్షన్‌లో ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. థియేటర్‌లో మిస్ అయిన మహేష్ బాబు అభిమానులు .. ఈ సినిమా చూసే అవకాశం మరోసారి వచ్చింది.

సురేందర్ రెడ్డి ( Surender Reddy) డైరెక్షన్ లో వచ్చిన “అతిధి” మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన అమృతా రావు హీరోయిన్‌గా నటించింది. సీనియర్ యాక్టర్‌ మురళీ శర్మ విలన్‌గా నటించాడు. ఆయన కెరీర్ ఈ సినిమాతోనే మొదలైంది. ఈ మూవీలో ఆయన చేసిన పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక బ్రహ్మానందం, ఆషిష్ విద్యార్థి వారి నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. మూవీ వచ్చి 17 ఏళ్ళు అయినా.. ఇప్పటికీ కూడా పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం, మహేష్ బాబు SSMB29 మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా, ఈ సినిమా ఓపెనింగ్ పూజ గ్రాండ్ గా జరిగింది. అయితే.. ఫోటోలు మాత్రం బయటకు రాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed