Prashant Kishor: క్షీణించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

by Shamantha N |
Prashant Kishor: క్షీణించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ఆరోగ్యం క్షీణించింది. దీంతో, ఆయన్ని ఆస్పత్రిలో చేరారు. బీపీఎస్సీ అవకతవకల వ్యవహారంలో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష (fast unto death) చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు దీక్షను భగ్నం చేసి.. ఆయన్న అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం అతన్ని పాట్నా కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే, కోర్టు అతనికి షరతులతో బెయిల్ మంజూరు చేసింది. భవిష్యత్తులో ఎటువంటి "చట్టవిరుద్ధమైన" నిరసనల్లో పాల్గొనకూడదని రాతపూర్వక హామీ ఇవ్వాలంది. దీంతో, రాతపూర్వక హామీ ఇవ్వకుండా.. జైలుకు వెళ్లేందుకు పీకే రెడీ అయ్యారు. తర్వాత అతడ్ని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు. ఆ తర్వాత షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను విడుదల చేశారు. అయితే, సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది

బీపీఎస్సీ అవకతవకలు

కాగా, చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల ప్రశాంత్ కిశోర్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిరసన ప్రదేశంలో గుమిగూడిన అభర్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించామన్నారు. ఇటీవల బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి . దీంతో, నిరుద్యోగులు పెద్దఎత్తున నిరసన చేపడుతున్నారు. వారికి మద్దతుగా.. ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష (fast unto death) చేపట్టారు. గత రెండు వారాలుగా బీపీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నా, ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed