MP Raghunandan: కేటీఆర్.. నిర్దోషిగా నిరూపించుకో: ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్

by Shiva |
MP Raghunandan: కేటీఆర్.. నిర్దోషిగా నిరూపించుకో: ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌వెస్క్: ఫార్ములా ఈ- కారు రేసు (Formula E-Car Race) కేసులో కేటీఆర్ (KTR) నిర్దోషిగా నిరూపించుకోవాలని ఎంపీ రఘనందన్ రావు (MP Raghunandan Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ (Quash Petition)ను హైకోర్టు (High Court) డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండి మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు పోలీసులు మంచిగా కనిపించారని ఎద్దేవా చేశారు. ఆయా వేదికలపై తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని ఉపన్యాసాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. గతంతో ప్రతిపక్ష నేతలను అదే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన వరకు వచ్చే సరికి కేటీఆర్ (KTR)‌కు సీన్ అర్థం కాలేదని.. నేడు తనకు పోలీసులపై నమ్మకం లేదంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసును లొట్టపీసు కేసు అని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడెందుకు పోలీసులను చూస్తే భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏ తప్పు చేయకపోతే.. సరైన అధారాలు చూపించి కేటీఆర్ కేసులో నిర్దోషిగా నిరూపించుకోవాలని ఎంపీ రఘునందర్ రావు సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed