Araku:అరకులో పర్యటించనున్న సుప్రీం జడ్జీల బృందం..?

by Jakkula Mamatha |
Araku:అరకులో పర్యటించనున్న సుప్రీం జడ్జీల బృందం..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ(Arakuloya) అందాలు వర్ణించాలంటే.. అందమైన పర్వతాలు, పాలధారాను తలపించే జలపాతాలు, కాఫీ తోటలు, మంచు కొండలు, జల సవ్వళ్ళు ఇలా ఎన్నో సుందరమైన దృశ్యాలు అరకులో మనం చూడవచ్చు. ఈ సుందర మనోహర దృశ్యాలు చూడడానికి పర్యాటకులు అరకు ప్రదేశానికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల(జనవరి) 12న సుప్రీంకోర్టు జడ్జీలు పర్యటించనున్నారు.

CJI, 25 మంది జడ్జీలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి(Chief Justice of the State) రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆదివారం విశాఖపట్నం నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు. న్యాయమూర్తుల రాక నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పోలీసులు(Police) భద్రతా ఏర్పాట్ల నిమిత్తం పర్యాటక ప్రాంతాల(Tourist areas)ను పరిశీలించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed