- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి శ్రీనివాస్ యాదవ్.. కాంగ్రెస్ నేతలను విమర్శిస్తే తరిమి కొడతాం: రోహిన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు తగిన బుద్ది చెబుతారని ఖైరతాబాద్డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో బీఆర్ఎస్నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. యువకులు, విద్యార్ధులు కాంగ్రెస్‌పార్టీకి అండగా నిలుస్తున్నారన్నారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ గాంధీ కుటుంబం గురించి అవమానకరంగా మాట్లాడడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుంచి ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.
గుట్కాలు బుక్కుతూ పాన్ డబ్బాల దగ్గర పనిచేసే శ్రీనివాస్ యాదవ్‌కు కాంగ్రెస్చరిత్ర తెలియదన్నారు. దేశం కోసం నెహ్రు కుటుంబం యావత్తు త్యాగం చేశారని గుర్తు చేశారు. తమ నాయకుడిని పిసుకుతా అని పేర్కొన్న తలసాని.. ఆయన్ను ప్రజలు పిసక్కుండా కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఫిషరీస్చైర్మన్మెట్టు సాయికుమార్మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ నాయకులపై విమర్శలు కురిపిస్తే తరిమి కొడతామన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని తలసానికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదన్నారు. తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.