తెలంగాణలో రాబోయేది TDP ప్రభుత్వమే: ష‌కీలారెడ్డి

by Satheesh |
తెలంగాణలో రాబోయేది TDP ప్రభుత్వమే: ష‌కీలారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తెలుగు మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ష‌కీలారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. అధ్యక్షురాలికిగా నియమించిన కాసానిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలోని అంద‌రినీ క‌లుపుకొని పోతానని, గ్రామస్థాయిలో మహిళలను చైతన్యం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఏ బాధ్యత‌ను అప్పగించినా స‌క్రమంగా, స‌మ‌ర్థవంతంగా నిర్వర్తిస్తాన‌న్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల‌పై, మ‌హిళల‌కు అన్నిరంగాల్లో జ‌రుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా తెలుగు మ‌హిళా విభాగం త‌ర‌పున ఆందోళ‌న కార్యక్రమాల‌ను చేప‌ట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కో-ఆర్డినేట‌ర్ బియ్యని సురేష్‌, బంటు వెంక‌టేశ్వర్లు, ముత్తినేని సైదేశ్వర్‌రావు,ఎం.సాంభ‌శివ‌రావు, ఏ ఎస్ రావు, ముప్పిడి గోపాల్‌, త‌దిత‌ర పాల్గొన్నారు.

Advertisement

Next Story