టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీని నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన కాసాని

by Vinod kumar |   ( Updated:2023-06-09 17:08:54.0  )
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీని నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన కాసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ అనుబంధ సంఘం ఎస్సీసెల్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. 10మంది ఉపాధ్యక్షులు, ఆరుగురు ప్రధానకార్యదర్శులతో పాటు పూర్తి కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కత్తి తమోధన్ రావు, దోమదుల్లా శామ్యూల్, అమరారపు శ్రీమన్నారాయణ,బి. సుదర్శన్, నక్కా సత్యనారాయణ, టి.అనిల్, గోసుకొండ వెంకటేశం, ఎం.శ్రీరాములు, కాగడ జోగీందర్ సింగ్, ఎం. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శులుగా గూడెపు రాఘవులు, తాళ్లపల్లి రాజేశ్వర్, జె.నర్సింగరావు, జె. జయరాజ్, గడ్డిపాటి వెంకటేశ్వర్లు, బైరపాక ప్రభాకర్, అధికార ప్రతినిధులుగా సారపాక రాజు, నూకపంగు కాశయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కలవల సురేష్ బాబు, ఎస్.మాణిక్యం, పరిక నాగరాజు, మీసాల సైదులు, కే సాయి కిరణ్, దాదా మౌని బ్రహ్మం, ఎం.తిమ్మయ్య, టి.శ్యామ్ సుందర్, రసమోని శ్రీనివాసులు, కే ఆనందరావు, కార్యదర్శులుగా ఆనంద్, యాచారం వెంకటేష్, ఒగ్గు బాల్ రాజ్, నర్సింగరావు, జి.శివకుమార్, బి.రమా దేవి, యెర్ణం జేమ్స్, ఎం. సర్వేశ్వర్ రావు, ఆక్రపు కృష్ణ వేణి, రమేష్ నియామకం అయ్యారు. ఆ కమిటీ సభ్యులు ఎన్టీఆర్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలంపల్లి అశోక్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్యయాదవ్, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్ మాట్లాడుతూ పటేల్ పట్వారి వ్యవస్థను టీడీపీ రద్దుచేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని, పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఇతర నాయకులు శామ్యూల్, శ్రీమన్నారాయణ, సత్యనారాయణ, సుదర్శన్, జోగిందర్ సింగ్, రాజశేఖర్, వెంకటేశం, రాజేశ్వర్, నర్సింగ్ రావు, జయరాజ్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story