Congress: మళ్ళీ నువ్వు జైలుకు పోవడం ఖాయం కేటీఆర్ ట్వీట్ కు టీ కాంగ్రెస్ కౌంటర్

by Prasad Jukanti |
Congress: మళ్ళీ నువ్వు జైలుకు పోవడం ఖాయం కేటీఆర్ ట్వీట్  కు  టీ కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు (KTR) తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కౌంటర్ ఇచ్చింది. నువ్వు చేసిన పాపాలకు తెలంగాణలో ఏ జైలు సరిపోదు.. నీకు అండమాన్ జైలు అయితేనే సరైందని ఎటాక్ చేసిది. తెలంగాణ ఉద్యమంలో సరిగ్గా 15 ఏళ్ళ క్రితం తనను అరెస్టు చేసి వరంగల్ సెంటర్ల్ జైలులో ఉంచారని, జైలుకెళ్లిన ఆ రోజు జైలు జీవితాన్ని గుర్తు చేసే ఆ బ్యాడ్జీ జీవితాతం నాకు ఆరాధనీయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఆదివారం స్పందించిన టీ కాంగ్రెస్.. 15 ఏళ్ళ క్రితం అరెస్ట్ చేసి నిన్ను వరంగల్ సెంట్రల్ జైలులో (Warangal Jail) పెట్టారని 100 ఏళ్ళ చరిత్ర కలిగిన జైలును కూలగొట్టించావు ఆ పాపం ఊరికే పోదు... కేటీఆర్ అంటూ విమర్శించింది. అధికారంలో ఉండగా మదంతో కళ్ళు నెత్తి కెక్కిన నీకు.. ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎవరు కనపడలేదని అధికారం పోగానే అందరి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న నీ తీరు యావత్ తెలంగాణ సమాజం చూస్తుందని దుయ్యబట్టింది. నువ్వు నీ కుటుంబం చేసిన పాపాలకు శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మళ్ళీ నువ్వు జైలుకు పోవడం ఖాయం అంటూ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story