- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ అంబేద్కర్ పేరును వాడుకుంటుంది: తమ్మినేని
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ భావజాలానికి, కమ్యూనిస్టు భావజాలానికి కొన్ని సిద్ధాంతాల ప్రకారం దగ్గర పోలికలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రెడ్ బుక్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం భారత విప్లవ కెరటం భగత్‌సింగ్ పుస్తకాన్ని సామూహిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ప్రగతిశీల భావాలున్న బుద్ధుడు, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి వారిని కమ్యూనిస్టులు సొంతం చేసుకోలేదని అన్నారు. అభ్యుదయ భావాలను ఒడిసి పట్టుకోవాలని, అలాంటి వారిని కమ్యూనిస్టు పార్టీ సొంతం చేసుకోవాలని కోరారు.
మనువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి పోరాడిన అంబేద్కర్‌ను బీజేపీ సొంతం చేసుకుంటున్నదని, దళితులను ఆకర్షించడానికి బీజేపీ అంబేద్కర్ పేరును సొంతం చేసుకుందన్నారు. దోపిడీని, అన్యాయాన్ని ఎదిరించడం, సమాజాన్ని మార్చడమే విప్లవమని వివరించారు. ప్రపంచ మానవాళి విముక్తి కోసం మార్క్స్- ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో గ్రంథాన్ని గతేడాది పఠనం చేశామన్నారు. ఇప్పుడు భగత్‌సింగ్ పుస్తకాన్ని పఠనం చేస్తున్నామని చెప్పారు. భగత్‌సింగ్ గొప్ప దేశభక్తుడే కాకుండా పరిణితి చెందిన కమ్యూనిస్టు అని తమ్మినేని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్, డిజి. నరసింహారావు, టి జ్యోతి, మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.