- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
T Congress: బీఆర్ఎస్ రాజ్యం వల్ల తడిసిన రాష్ట్రం.. పత్తా లేని పాత పాలకులు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టారు. అయితే ఈ వరదలపై ప్రతిపక్ష నాయకులు అధికారపక్షంపై ఆరోపణలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని, నాయకుల నిర్లక్ష్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, కేసీఆర్ హయాంలో తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టామని తెగ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై సంచలన విమర్శలు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైకరి వల్లే రాష్ట్రం నీట మునిగిందని, విపత్కర పరిస్థితుల్లో పాత పాలకులు పత్తా లేకుండా పోయారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అంతేగాక గొలుసుకట్టు చెరువుల గొలుసులు తెంపారని, నాలాల నడుములు వంచారని, కాలువలను కబ్జా చేశారని మండిపడ్డారు. అలాగే డ్రైనేజీని డేంజర్ లో పెట్టారని, కబ్జాలు చేసి కాలనీలను ముంచారని, ప్రాజెక్టుల పేరుతో ప్రజలను పరేషాన్ చేశారని పోస్ట్ పెట్టారు. దీనిపై రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎక్స్ లో రాసుకొచ్చారు.