- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Open AI: ఓపెన్ ఏఐ మరో సంచలనం.. గూగుల్‌కు పోటీగా సెర్చ్ ఇంజిన్ ఆప్షన్..!
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్(Google)కు ఓపెన్ ఏఐ(Open AI) సంస్థ నుంచి ఛాలెంజ్ ఎదురైంది. ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ(chatgpt) గూగుల్‌కు పోటీగా మరో కొత్త ఫీచర్(New Feature)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఫౌండర్ శామ్ ఆల్ట్ మన్(Sam Altmann) ఓ ప్రకటనలో తెలిపారు. చాట్‌జీపీటీలో భాగంగా ఈ ఆప్షన్ విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త సెర్చ్ జీపీటీ ఫీచర్ ద్వారా యూజర్లు ఇకపై వెంటనే వెబ్ లింక్స్(Web links) తో కూడిన సమాచారాన్ని ఇంటర్నెట్(Internet)లో తెలుసుకోవచ్చని, ఇంతకుముందులా సెర్చ్ ఇంజిన్(Search Engine)పై ఆధారపడాల్సిన అవసరం లేదని ఓపెన్ ఏఐ పేర్కొంది.
ఇందుకోసం చాట్‌జీపీటీ హోమ్ పేజీలో కొత్తగా సెర్చ్ ఆప్షన్‌ను ప్రవేశ పెట్టింది. అక్కడి నుంచి క్రికెట్ స్కోర్(Cricket Score), స్టాక్ న్యూస్, (Stock News) వంటి తదితర సమాచారాన్ని పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఫీచర్ వెబ్‌సైట్(Website)తో పాటు యాప్(App)లోనూ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం డబ్బులు చెల్లించిన సబ్‌స్క్రైబర్ల(Subscribers)కే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా భవిష్యత్తులో ఫ్రీ వర్షెన్(Free Version) యూజర్లూ కూడా ఈ సదుపాయాన్ని యూజ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఓపెన్ ఏఐ తెలిపింది. చాట్ జీపీటీ ఇప్పటి వరకు కేవలం డేటా బేస్(Data Base)లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అందించేది. అయితే ఇక నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని కూడా అందించనుంది.
🌐 Introducing ChatGPT search 🌐
— OpenAI (@OpenAI) October 31, 2024
ChatGPT can now search the web in a much better way than before so you get fast, timely answers with links to relevant web sources.https://t.co/7yilNgqH9T pic.twitter.com/z8mJWS8J9c