- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tribal University : ములుగు సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి భూమి కేటాయిస్తూ జీవో జారీ
దిశ, వరంగల్ బ్యూరో : విభజన హామీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కి భూముల కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ములుగు జిల్లా ములుగు మండల కేంద్రంలోని గట్టమ్మ వద్ద సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు గాను, ములుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 837/1లో ఉన్న దాదాపు 212 ఎకరాల ప్రభుత్వ భూములను సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి అనుకూలంగా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో. నెంబర్ 571 ను జారీ చేసింది. రెవెన్యూ పరంగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి BSO-23 కింద నిర్దేశించబడిన కేటాయింపు సాధారణ షరతులకు లోబడి BSO-24 ఆర్డర్‌ల క్రింద భూమి వినియోగం జారీ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీకి భూ కేటాయింపులు జరగడంతో యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది.