Seethakka : రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి హామీ ప‌నులు.. రూ.1,372 కోట్ల నిధుల‌తో ప్ర‌ణాళిక‌లు : సీతక్క

by Ramesh N |
Seethakka : రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి హామీ ప‌నులు.. రూ.1,372 కోట్ల నిధుల‌తో ప్ర‌ణాళిక‌లు : సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) రాష్ట్రంలో ప‌క‌డ్బందిగా అమ‌లు చేయాల‌ని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అమ‌లు పై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌ణాళిక బ‌ద్దంగా ప‌నులు చేయించాల‌ని సూచించారు. రైతుల ఆదాయం పెంచేలా, ఉపాధి హ‌మీ నిధుల‌తో వ్య‌వ‌సాయ‌ అనుబంధ ప‌నుల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌న్నారు. శాశ్వ‌తంగా నిలిచేలా ఉపాధి హ‌మీ ప‌నులు చేప‌ట్టాలన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని చెప్పారు.

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 1,372 కోట్లతో రైతుల ఆదాయం పెంచేందుకు, గ్రామీణ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం అయ్యాయని తెలిపారు. ఇందులో వ్యవసాయ పొలాలకు బాటలు, 2,700 ఎకరాలలో పండ్ల తోటలు, వర్షపు నీటి నిల్వ, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీఛార్జ్ గుంతలు, గ్రామ మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాలకు పశు కొట్టాలు, వర్మి కంపోస్టు వంటి ప్రాజెక్టులు కల్పించి ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు, అమలు ప్రణాళికలపై అధికారులతో చర్చించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed