Collector Gautham : సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

by Sridhar Babu |
Collector Gautham : సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు (Collector Gautham)అన్నారు. శుక్రవారం శామీర్ పేట్ లోని బాబాగూడలో నిర్వహిస్తున్న సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను సేకరించాలని సూచించారు. ఇంటి యాజమాని పేరు, కుటుంబ సభ్యులు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలని సూచించారు. పూర్తి చేసిన సర్వే దరఖాస్తు ఫారాలను (Survey Application Form)ఎన్యూమరేటర్లు తమకు నిర్దేశించిన డేటా ఎంట్రీ కేంద్రానికి వెళ్లి అప్ లోడ్ చేయించాలని కోరారు.

అప్ లోడ్ చేసే టైంలో ఎటువంటి పోరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ ఇంటింటికి అతికించిన స్టిక్కర్లను , సర్వేకు సంబంధించిన ప్రొఫార్మలను పరిశీలించారు. సర్వేకు సంబంధించి ఏ విధంగా వివరాలను నమోదు చేస్తున్నారని ఆరా తీశారు. కుటుంబ సభ్యులను ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారని, మీకు ఎన్ని ఇండ్లు కేటాయించారని సర్వే నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వేలో కుటుంబ యజమాని కానీ, సభ్యులు కానీ స్వచ్ఛందంగా తెలిపిన వివరాలను మాత్రమే ప్రొఫార్మాలలో నింపాలని సూచించారు. సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు హాజరవుతున్నారా..? అని ఎంపీడీఓ మమతా బాయిని కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆధార్, ఓటరు కార్డులు ఉన్న వారి వివరాలను తప్పక నమోదు చేయాలని సూచించారు.

Advertisement

Next Story