UPI Transactions: అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు

by Maddikunta Saikiran |
UPI Transactions:  అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు
X

దిశ, వెబ్ డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు(UPI Transactions) గత నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అక్టోబర్(October)లో మొత్తం 1658 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని, వాటి విలువ రూ. 23.5 లక్షల కోట్లుగా ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పోయిన నెలలో యూపీఐ ట్రాన్సక్షన్స్ పెరిగినట్లు పేర్కొంది. సెప్టెంబర్ నెలలో ఈ లావాదేవీల సంఖ్య 1500 కోట్లుగా నమోదైందని NPCI వెల్లడించింది. అలాగే వార్షిక ప్రాతిపదికన సంఖ్యలో 45 శాతం, విలువలో 34 శాతం పెరిగిందని తెలిపింది. ఇక సెప్టెంబర్ లో రోజుకి సగటున 5 కోట్ల ట్రాన్సక్షన్స్ జరగగా, అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 5.35 కోట్లకు పెరిగింది. అలాగే ఫాస్టాగ్(Fastag), ఆటోమేటెడ్ టోల్ పేమెంట్ సిస్టమ్(ATPS) ద్వారా జరిగిన ట్రాన్సక్షన్ల విలువ 34 కోట్లుగా ఉందని, బ్యాంకుల ద్వారా జరిగే ఐఎంపీఎస్(IMPS) లావాదేవీల సంఖ్య 45 కోట్లుగా నమోదయ్యాయని NPCI తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed