పండుగపూట విషాదం..గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

by Sridhar Babu |   ( Updated:2024-11-01 12:21:34.0  )

దిశ, చెన్నూర్ : గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. (Two are missing)మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని దుగ్నేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సుందర్శాల గ్రామంలోని గోదావరిలోకి స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే దుగ్నేపెల్లి గ్రామానికి చెందిన దాసరి కృష్ణ, మధులతల కుమారుడు దాసరి సాయి(16) (Dasari Sai)ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కరీంనగర్​లో చదువుతున్నాడు.

అతనితో పాటు మరో విద్యార్థి గ్రామానికి చెందిన కొండ పోచయ్య, శోభల కుమారుడు కొండ అశ్విత్(19) (Aswit)కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీపావళి పండుగను పురస్కరించుకొని తోటి మిత్రులతో కలిసి గ్రామంలోని గోదావరిలో స్నానానికి వెళ్లారు. నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదు. పట్టణ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు గోదావరి నది వద్దకు చేరుకున్నారు. బంధు మిత్రుల రోధనలతో గోదావరి నది ప్రాంతం మారుమోగింది.

Advertisement

Next Story

Most Viewed