- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T Congress: ఇలా మాట్లాడటానికి సిగ్గులేదా కేటీఆర్?.. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ కట్టడానికి అనుమతి ఇచ్చింది నువ్వే కదా.. మంత్రిగా పనిచేసి ఇలా మాట్లాడటానికి సిగ్గులేదా..? అని కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. జన్వాడ ఫాంహౌజ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టి. కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియోలో కేటీఆర్ మాట్లాడుతూ.. నాకు ఎటువంటి ఫాంహౌజ్ లేదు.. నా మిత్రుడికి ఉంటే నేను ఏడు ఎనిమిదేళ్ల కింత లీజ్ కు తీసుకున్నానని, ఒకవేళ అది ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తానని చెప్పారు.
దీనిపై తెలంగాణ కాంగ్రెస్.. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి, ఇలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నందుకు సిగ్గులేదా..? అని మండిపడింది. అలాగే అక్రమ కట్టడాన్ని లీజుకు ఎలా తీసుకున్నావ్..?, అక్రమ కట్టడానికి అనుమతి ఇచ్చింది నువ్వే కదా..? అని ప్రశ్నించింది. లీజుకు తీసుకున్నందుకు ఎన్ని డబ్బులు కట్టావ్..? అని, దమ్ముంటే దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్లు బయటపెట్టు..? అని టి కాంగ్రెస్ నిలదీశింది. కాగా జన్వాడా ఫాంహౌజ్ కూల్చకుండా హైడ్రాకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ మిత్రుడు ప్రదీప్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నిబందనల మేరకే కూల్చివేతలు జరపాలని, 99 జీవో ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చాలని ఆదేశాలు ఇచ్చింది.