ఒడిశా రైలు దుర్ఘటన.. కీలక నిర్ణయం తీసుకున్న T- బీజేపీ!

by Satheesh |
ఒడిశా రైలు దుర్ఘటన.. కీలక నిర్ణయం తీసుకున్న T- బీజేపీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో సంభవించిన రైలు ప్రమాదం నేపథ్యంలో టీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు శనివారం పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ శనివారం ప్రకటించారు. రైలు ప్రమాదం మృతులకు సంతాపంగా జేపీ నడ్డా, బండి సంజయ్ అన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకోగా ఇవాళ జరగాల్సిన మీడియా సమావేశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రద్దు చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా పర్యటించాల్సిన కేంద్ర మంత్రి బి.ఎల్ వర్మ సైతం తన కార్యక్రమాలను రుద్దు చేసుకున్నట్లు తెలిపారు.

అయితే ఈ కార్యక్రమాలు రేపు, ఎల్లుండి యథావిధిగా ఉటాయని పేర్కొన్నారు. నేడు వరంగల్ ఈరోజు జరగాల్సిన పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాలను రద్దు చేయడం జరిగింది పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొనాల్సిన మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సహా ఇన్ చార్జి అరవింద్ మీనన్ రేపటి కార్యక్రమాల్లో హాజరవుతారని ప్రకటనలో వెల్లడించారు. రైలు దుర్ఘటనలో మృతులకు పార్టీ తరపున సంతాపంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పార్టీ తరపున భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed