T BJP: ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు.. బీజేపీ నేత శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-09-18 14:43:58.0  )
T BJP: ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు.. బీజేపీ నేత శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:జానీ మాస్టర్ వ్యవహారం ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు అని, బాధితురాలికి బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందని మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అని పిలవబడే షేక్ జానీ పాషా లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ యంత్రాంగం కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.

మహిళా కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్నప్పటి నుంచే ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారని, అయినా ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయకపోవడం బాధాకరమైన విషయమని తెలిపారు. ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు అని, ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం బీజేపీ మహిళా మోర్చా ఖండిస్తుందని చెప్పారు. ఈ ఘటనను లవ్ జిహాదీ కేసుగా పరిగణించాలని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అంతేగాక బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందని శిల్పారెడ్డి భరోసా ఇచ్చారు.

Read More..

Johnny Master: జానీ మాస్టర్ వివాదంలో కీలక పరిణామం.. తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు

Advertisement

Next Story