- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తెలంగాణలో మజ్లిస్‌ను తరిమికొడతాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో హిందువుల దమ్ము చూపించే రోజు వచ్చిందని, పాత బస్తీ నుంచి మొదలు యావత్ తెలంగాణ మొత్తం తమదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కార్వాన్ ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మజ్లిస్‌ను తరిమికొడతామని ధీమా వ్యక్తం చేశారు. భాగ్యనగర్ ప్రజలంతా మజ్లిస్ సవాల్‌ను స్వీకరించి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ యువకులు తనకు 8 నెలలపాటు సమయం కేటాయిస్తే రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత తనదని స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ ఒవైసీ కండ్లలో ఆనందం చూసేందుకు కలశం, మామిడి తోరణాలతో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త భవనం పేరుతో డోమ్‌లను నిర్మించారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే బరాబర్ ఆ డోమ్‌లను కూల్చివేస్తామని మరోసారి వ్యాఖ్యానించారు. 12 శాతం ఓట్లున్న పార్టీ తెలంగాణలో 7 సీట్లు గెలిస్తే.. 80 శాతం ఓట్లున్న హిందువులు ఎన్ని సీట్లు గెలవాలని ఆయన ప్రజలను ప్రశ్నించారు. తాను ఎన్నడూ ముస్లింలు, క్రైస్తవులను కించపర్చలేదని పేర్కొన్నారు. కానీ మజ్లిస్ నేతలు 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్నారని, ఆ వ్యాఖ్యలు చేసిన వారి వీపు సాఫ్ చేయాలని ఘాటుగా స్పందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగజేబ్ ఆస్థానంలోని రాజా మాన్ సింగ్ టైపు అని బండి సంజయ్ విమర్శలు చేశారు. మజ్లిస్ భాగ్యనగరంలో తప్పా మరో చోట పోటీ చేయడంలేదని, హిందువులకు చేతకావడం లేదని సవాల్ చేస్తూ మరీ పాతబస్తీలో పోటీ చేసి గెలుస్తున్నారని పేర్కొన్నారు. భాగ్యనగర్ హిందువులు ఎంఐఎం నేతల సవాల్‌ను చాలెంజ్‌గా స్వీకరించి వచ్చే ఎన్నికల్లో ఓడించి తెగువ చూపించాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ నేతలకు దమ్ముంటే 119 స్థానాల్లో పోటీచేయాలని, వారికి డిపాజిట్లు కూడా దక్కుకుండా చేస్తామన్నారు.
ఎంఐఎం నేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను చంకలో వేసుకుని వచ్చినా తాము సిద్ధమని, బీజేపీ మాత్రం సింగిల్‌గా వస్తుందన్నారు. పాతబస్తీకి రావాలంటే తన పర్మిషన్ తీసుకోవాలంటూ ఒవైసీ సవాల్ చేస్తే అన్నీ మూసుకుని ఫాంహౌజ్‌లో పడుకున్న వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. కానీ తాను మోడీ వారసుడిగా వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద సభ నిర్వహించి హిందువుల తెగువ చూపించానని తెలిపారు. రామరాజ్య స్థాపన కోసం రాబోయే 8 నెలలపాటు ఉద్యోగాలను, వ్యాపారాలను పక్కనపెట్టి పూర్తి సమయం కష్టపడదామని, తనతో కలిసిరావాలని బండి కోరారు.