Minister Seethakka: విద్యార్ధులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి : మంత్రి సీతక్క

by Y. Venkata Narasimha Reddy |
Minister Seethakka: విద్యార్ధులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, అందుకు పాఠశాలల్లోనే గట్టి పునాది వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) ఆకాంక్షించారు. ములుగు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన(Science exhibition)లను జాకారంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో మంత్రి సీతక్క ప్రారంభించారు. విద్యార్ధులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిన ప్రయోగాలను పరిశీలించి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికి తీసి ప్రదర్శించేందుకు, ప్రోత్సహించేందుకు వేదికగా ఉంటాయని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్ధులను నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిశోధన, జిజ్ఞాసలతోనే విద్యార్ధుల్లో మేధోవికాసం పెంపోందుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శలను మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆ జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed