సైనిక లాంఛనాల నడుమ వీర జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తి

by Mahesh |
సైనిక లాంఛనాల నడుమ వీర జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్మీ జవాన్లు రోజువారీ డ్యూటీ లో భాగంగా.. కుంబింగ్ నిర్వహిస్తుండగా.. ల్యాండ్ మైన్(Land mine) పై అడుగు వేసిన జవాన్(jawan).. వెంటనే మిగిలిన 30 మంది జవాన్లను అప్రమత్తం చేశాడు. అనంతరం ఆ ల్యాండ్ మైన్ పేలడంతో జవాన్ సుబ్బయ్య(Subbaiah) వీర మరణం(A heroic death) పొందారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రావిపాడు కు చెందిన వరికుంట్ల సుబ్బయ్య మృతదేహం నిన్న రాత్రి తన సొంత గ్రామానికి చేరుకుంది. కాగా ఈ రోజు జవాన్ సుబ్బయ్య సొంత తోటలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు.. సైనిక లాంఛనాల(Military insignia) నడుమ జరిగిన అంతిమయాత్ర( last rites) కొనసాగగా.. పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో గ్రామస్తు, అభిమానుల నడుమ అమర వీరుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తి పోయింది.

Advertisement

Next Story

Most Viewed