Congress fire on KTR letter: రాహుల్ కు కేటీఆర్ లేఖ.. కాంగ్రెస్ ఫైర్

by Prasad Jukanti |
Congress fire on KTR letter: రాహుల్ కు కేటీఆర్ లేఖ.. కాంగ్రెస్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ (KTR Latter) రాయడంపై కాంగ్రెస్ కౌంటర్ (Congress Counter) ఇచ్చింది. ఏడాది కాలంగా చిత్తశుద్ధితో పరిపాలన చేస్తుంటే ఓర్వలేక, అసెంబ్లీకి రాని దద్దమ్మలు మాకు నీతులు చెబుతున్నారని ఎంపీ చాలమ కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాయడం కాదని ముందు ఫామ్ హౌస్ లో పడుకున్న మీ నాయిన ను అసెంబ్లీకి తీసుకురావాలన్నారు. కేటీఆర్ లేఖపై గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చామల.. కేటీఆర్ లేఖ హస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారని ఏం చేయాలో మాకు తెలుసన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చామమని ఇంకా నెరవేరుస్తామన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి రోజు కేటీఆర్, హరీశ్ రావు ఓర్వలేక మా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారన్నారు. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడమేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో రాహుల్ గాంధీకి తెలుసన్నారు. రుణమాఫీ, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, మెస్ చార్జీలు పెంచామని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరు గొప్ప అనే పంచాయతీ తేల్చుకోలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు గమనించాలన్నారు.

కడుపుమంటతో రాహుల్ కు లేఖ: ఆది శ్రీనివాస్

కేటీఆర్ కు ప్రతిపక్ష నేత పాత్ర పోషించడం చేత కావడం లేదని అందుకే తన పేటీఎం రైటర్లు రాసిన లేఖను రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పంపించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) ఫైర్ అయ్యారు. కేటీఆర్ లేఖపై గురువారం మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్ ప్రజలలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి కేటీఆర్ కడుపుమంటతో రాహుల్ గాంధీకి లేఖ రాశాన్నారు. మీరెంత పెద్ద లేఖలు రాసినా, మీ వాట్సాప్ యూనివర్సిటీలో మార్ఫింగ్ ఫోటోలతో ఎంత విద్వేషం రక్తికట్టించాలని చూసినా మీ మాటలకు ప్రజలు మోసపోరన్నారు. రెండు దఫాలుగా మీ మాయమాటలను నమ్మి మోసపోవడంతోనే ప్రజలు మీకు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారన్నారు. ఇకనైనా పిచ్చి పిచ్చి రాతలు రోతలు పెట్టించే మాటలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పని చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed