- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలి : ఐఏఎస్ నాగిరెడ్డి
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించాలని డైరెక్టర్ జనరల్, తెలంగాణ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ వై.నాగి రెడ్డి అన్నారు. బుధవారం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారంలో గల శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల మేధాశక్తిని ఎప్పటికప్పుడు వెలికి తీసే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.
ప్రస్తుతం ఆధునిక యుగంలో పోటీ ప్రపంచంలో విద్యార్థులు పరిగెత్తాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 1000కి పైగా ప్లేసెమెంట్స్‌తో పాటు అత్యధిక ప్యాకేజీ రూ.9.50 లక్షలు రావడం హర్షణీయం అన్నారు. అనంతరం అకాడమిక్ టాపర్స్, కల్చరల్ ఈవెంట్స్, క్రీడాలలో గెలిచినా విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాళాశాల సెక్రెటరీ చింతల రవీంద్రనాథ్ యాదవ్, వైస్ చైర్మన్ అనంతుల హ్రిదయ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సాయి సత్యనారాయణ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.