- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cabinet Sub Committee: ఏపీ రాజధాని నిర్మాణ పనులపై కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీ రాజధాని భూముల(AP Capital lands)పై సుధీర్ఘంగా చర్చించిన మంత్రులు 2014-19 సమయంలో చాలా సంస్థలకు కేటాయింపులు జరిపినట్లు గుర్తు చేశారు. కానీ జగన్ ప్రభుత్వం(Jagan Government) పనులు నిలిపివేయడంతో ఆ తర్వాత ఎవరూ ముందుకు రాలేదని మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. అమరావతి నిర్మాణ పనులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ఆసక్తి చూపించాయని, ఈ మేరకు ప్రభుత్వాన్ని కలిశాయని పేర్కొన్నారు. ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి రీ టెండరింగ్‌ను నిర్ణయిస్తామని చెప్పారు.
మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) మాట్లాడుతూ సీఆర్డీఏ(CRDA) పరిధిలో పనులు జరిగేకొద్ది మరిన్ని సంస్థలు వస్తాయని తెలిపారు. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వీటిపైనా కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించామని ఆయన చెప్పారు. ఇప్పటికే భూములు కేటాయించిన సంస్థలు ఏవి ఆసక్తి చూపుతున్నాయో వాటి పేర్లను పరిశీస్తున్నామని పయ్యావుల పేర్కొన్నారు.