- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR ఢిల్లీ పర్యటనలో ఎన్నో సీక్రెట్స్.. రాష్ట్రంలో రాజుకుంటున్న రాజకీయం
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అక్కడ ఏం జరిగింది? అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి వరుసకు బావమరిది అయిన సృజన్‌రెడ్డికి అమృత్ టెండర్లు దక్కిన విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లానని కేటీఆర్ ప్రకటించారు. ఫిర్యాదు లేఖను సైతం విడుదల చేశారు. అయితే ఆయన కేంద్ర మంత్రిని కలిసినట్లు ఒక్క ఫొటో సైతం బయట పెట్టలేదు. అప్పటికే కేటీఆర్ హస్తిన టూర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా కేటీఆర్.. బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఇదే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.
బీజేపీ ముఖ్య నేతలను కలిశారని కాంగ్రెస్ ఆరోపణ
కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ ముఖ్య నేతలను కలిశారని, రాబోయే రోజుల్లో అందుకు అనుగుణమైన మార్పులు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదే రకమైన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు బీజేపీతో పొత్తుకు మొగ్గు చూపుతున్నారని, కమలం పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్‌కు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వారి మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం ఊపందుకున్నది. మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. అందుకే ‘గులాబీ’ నేతలు ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్‌మెంట్ దొరుకుతున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీల బంధానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.
కేసుపై గవర్నర్ అనుమతి ఇవ్వకుండా..
ఫార్ములా ఈ- రేస్ కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉన్నదని, ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి చెందిన కీలక నేతలను కలిసి తనపై కేసు నమోదు కాకుండా, గవర్నర్ అనుమతి ఇవ్వకుండా చేయాలని కేటీఆర్.. బీజేపీ నేతలను కలిసి వేడుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఆధారాలు సైతం చూపిస్తున్నాయి. గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసి సుమారు మూడు వారాలు అవుతున్నా అనుమతి రావడం లేదని, దీనికి కేటీఆర్ భేటీయే కారణమని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న బీజేపీ
కేటీఆర్ కేంద్ర మంత్రిని కలిసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కమలనాథులు ఖండించారు. అసలు కేంద్ర మంత్రి.. కేటీఆర్‌కు అపాయింట్‌మెంటే ఇవ్వలేదని, కలిస్తే ఆధారాలు చూపించాలంటూ ఆ పార్టీ కీలక నేతలు సవాల్ విసురుతున్నారు. దీనిపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం స్పందించారు. అసలు కేటీఆర్.. మినిస్టర్‌ను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాతే ఆయన అరెస్టు ప్రాసెస్ ఆగిపోయిందని, కాంగ్రెస్‌తో రాజీ కుదిరిందని, అందుకే ఆయనపై ఒక్క కేసూ పెట్టడం లేదని ప్రకటించారు. కేటీఆర్‌పై ఈ ఫార్ములా కార్ రేస్, కలెక్టర్‌పై దాడి కేసు, గతంలో నిధుల దుర్వినియోగం, ధరణి వంటి అనేక ఆరోపణలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫొటోలు తీయలేదంటున్న బీఆర్ఎస్
ఇటీవలే ఢిల్లీ వెళ్లిన కేటీఆర్.. కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిశారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మినిస్టర్ ఫొటోలకు నిరాకరించడంతో వాటిని తీయలేదని, కేటీఆర్.. సెంట్రల్ మినిస్టర్‌తో స్వయంగా మాట్లాడారని పేర్కొంటున్నారు. రాజకీయంగా తమను ఇరకాటంలో పెట్టేందుకే కాంగ్రెస్, బీజేపీలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.