Srisailam Update: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. తాజా అప్‌డేట్ ఇదే!

by Shiva |
Srisailam Update: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. తాజా అప్‌డేట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సహా ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ పరిణామంతో జూరాలతో పాటు శ్రీశైలం జలాశయాలు నిండుకుండలా మారి కనువిందు చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అధికారులు 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4,65,261 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,91,602 క్యూసెక్కులుగా ఉంది. అయితే, శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Advertisement

Next Story