ఎస్‌ఆర్‌ఆర్ రేట్లు పెంచండి.. సీఎండీ రఘుమారెడ్డికి వినతి

by Javid Pasha |
ఎస్‌ఆర్‌ఆర్ రేట్లు పెంచండి.. సీఎండీ రఘుమారెడ్డికి వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) పెంచాలని ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సంవత్సరం 30 శాతానికి దీన్ని పెంచాలని వారు పేర్కొన్నారు. అలాగే తమ భవిష్యత్ కార్యాచరణపైనా వారు చర్చింకున్నట్లు చెప్పారు. కాగా సీఎండీ రఘుమారెడ్డి సైతం తమ వినతిపై సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ సభ్యులు వెల్లడించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను కూడా సకాలంలో అందేలా చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఆపై సంస్థలోని అన్ని డివిజన్లలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు జేఏసీ నేతలు చెప్పారు. పనులు నిర్వహించే క్రమంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే దానికి కాంట్రాక్టర్ కు ఎలాంటి సంబంధం లేదని, యాజమాన్యమే బాధ్యత వహించాలని సీఎండీకి వివరించినట్లు వారు తెలిపారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ కూడా యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎండీ రఘుమారెడ్డిని కలిసినవారిలో ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ జేఏసీ చైర్మన్ పీ భాస్కర్, మాజీ బోర్డ్ మెంబెర్ నక్క యాదగిరి, మహిపాల్ రెడ్డి. బ్రహ్మచారి, గోవర్ధన్ రెడ్డి, రాజు, సముద్రాల శ్రీనివాస్, గంపా కృష్ణ, నాగిరెడ్డి, రాములు, అన్ని జిల్లాల కాంట్రాక్టర్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed