New political party: తెలంగాణలో మరో సంచలన పరిణామం.. త్వరలో కొత్త రాజకీయ పార్టీ!

by Prasad Jukanti |
New political party: తెలంగాణలో మరో సంచలన పరిణామం.. త్వరలో  కొత్త రాజకీయ పార్టీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయ. మరోసారి అధికారం తమదేనంటూ కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంటే, కాంగ్రెస్ ను గద్దె దించి ఆ స్థానం కైవసం చేసుకోవాలని కమలం పార్టీ స్కెచ్ వేస్తంది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తమకు ప్రజల్లో కలిసి రాబోతున్నదన్న అంచనాల్లో బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్ని తమ రాజకీయ అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ (New Political Party) పురుడు పోసుకునే అంశం స్టేట్ పాలిటిక్స్ లో జోరుగా చర్చకు వస్తోంది. బీసీ (BC) నినాదంతో త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకోబోతుందన్న చర్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా బీసీ నేత వట్టెజానయ్య యాదవ్ (Vatte Janaiah Yadav) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్ లో నూటికి నూరు శాతం రాజకీయ పార్టీ రాబోతున్నదని అసెంబ్లీ ఎన్నికలకు తమకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ ఉన్న మా జాతి ప్రత్యేకంగా రాజకీయ వేదిక రూపొందించుకునే ప్రణాళికలో ఉన్నామన్నారు. బీసీలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయడం రాదా? ఎన్నికల కమిషన్ మాకు పార్టీ రిజిస్ట్రేషన్ చేయదా? బీసీలమంతా ఏకమైతే ఇన్నాళ్లు మమ్మల్నీ ఓట్ల కోసం వాడుకున్న రాజకీయ పార్టీలకు బదులు మేమే సొంతంగా రాజ్యాధికారం సాధించుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ సభలో కీలక ప్రకటన?:

బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఫిబ్రవరి 2న వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో బీసీ యుద్ధభేరి (Warangala BC Yudhabheri) సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) పలువురిని కలిసి ఈ సభ సక్సెస్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ సభ బీసీలకు మరో స్వాతంత్ర్య పోరాటం లాంటిదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా జరగబోతున్న ఈ సభలోనే బీసీ రాజకీయ పార్టీలో కీలక ప్రకటన వెలువడే చాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా. ఇటీవల ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేయడంతో బీసీ పార్టీ చర్చ జోరుగా జరిగింది. ఆ తర్వాత కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ అవకాశం ఇవ్వడంతో ఆ అంశం కాస్త పెండింగ్ పడిందా? అనే టాక్ వినిపిస్తున్న తరుణంలో తాజాగా వట్టెజానయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే స్టేట్ పాలిటిక్స్ అంతా బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్న తరుణంలో వరంగల్ బీసీ యుద్ధభేరి వేదికగా ఎలాంటి ప్రకటన రాబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.

Next Story

Most Viewed