- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూసూద్‌కు ఎందుకివ్వరు? పద్మా అవార్డులపై చర్చ
దిశ, డైనమిక్ బ్యూరో: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం నిన్న ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ చర్చ జరుగుతుంది. ప్రముఖ నటుడు సోనూసూద్‌కు ఈ సారి కూడా పద్మా పురస్కారాలు రాలేదని నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కరోనా టైమ్‌లో దేశావ్యాప్తంగా సోనూసూద్ చేసిన అనేక సహాయాలు, ఆయన చారిటీ గురించి నెటిజన్లు గుర్తు చేసుకున్నారు. ఆ టైమ్‌లో నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్వయంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కు లేఖ రాసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి సోనూసూద్ చారిటీ ద్వారా సహాయాలు చేస్తున్నారని, అయిన కూడా సోనూసూద్ లాంటి వాళ్ళు అవార్డులకి అనర్హులా..? అని చర్చానీయాంశంగా మారింది.
సోనూసూద్‌కు అవార్డు రాకపోవడానికి కారణాలు కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతనికి అవార్డు రావడానికి అతను బీజేపీ సపోర్టర్ కాదని కేంద్రాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ ‘పద్మ’ పురస్కారాలు రాను రాను విలువలు ఉండవేమో ? ఏమి మాట్లాడకుండా గంగిరెద్దు లాంటి వారికి ప్రధాని మోడీ సర్కార్ పురస్కారాలు ఇస్తారని రుజువైందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సోనూసూద్ కు వెయ్యి భారతరత్నల కంటే గొప్ప సర్టిఫికెట్ భారతదేశ ప్రజలు మొత్తం ఎప్పుడో ఇచ్చేశారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.