- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో పర్యటించనున్న సోనియా, రాహుల్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 24 లేదా ఆ తర్వాత ఇద్దరూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్నారు. తొలుత ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఆమెతో పాటు రాహుల్‌గాంధీ కూడా వస్తున్నందున అదే రోజున వరంగల్‌లో రైతు రుణమాఫీ విజయోత్సవ సభను నిర్వహించాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఈ నెల 20వ తేదీన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రావడానికి వీలు పడదన్న సమాచారం వచ్చింది. దీనికి బదులుగా ఈ నెల 24 లేదా ఆ తర్వాత అనుకూలమైన తేదీల్లో రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ నిర్దిష్టమైన తేదీలను మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలు ఇంకా ఖరారు చేయలేదు.
రాజీవ్‌గాంధీ జయంతి (ఆగస్టు 20) సందర్భంగా సోనియాగాంధీ రావడానికి మూడు రోజులే ఉండడంతో వేర్వేరు కారణాలతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరో తేదీన వస్తామని సంకేతమిచ్చినట్లు తెలిసింది. సీఎం రేవంత్ అనుకున్న షెడ్యూలు ప్రకారం సోనియాగాంధీ హైదరాబాద్‌కు వచ్చి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి వెంటనే ఢిల్లీ వెళ్ళిపోతారని, ఆమెతో పాటే రాహుల్‌గాంధీ వస్తున్నా ఈ కార్యక్రమం తర్వాత నేరుగా వరంగల్‌లో జరిగే విజయోత్సవ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కానీ వారిద్దరు రావడం ఖరారే అయినా తేదీలు మాత్రం మారే అవకాశమున్నదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం వీరిద్దరి రాకపై మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది.