- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన స్మితా సబర్వాల్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న అధికారుల్లో ఈమె ఒకరు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు. ఈమెకు దాదాపు 5 లక్షలకు పైగా ఫాలోవర్సు కూడా ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు ఆమె సీఎంవో ఆఫీసులో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా ఆమె మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉండదని, అందుకే కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి సిద్ధమయ్యారా?, లేక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. కేంద్ర సర్వీసులకు తాను అప్లయ్ చేయలేదని వివరించారు. రాజకీయాలకు వస్తానో.. రానో ఇప్పుడే చెప్పలేనని.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడెలా చెప్పగలమన్నారు. తనపై వచ్చే విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వనని, నా పని నేను చేసుకుంటూ వెళ్తానని స్మితా సబర్వాల్ వివరించారు. కాగా, 2000 సంవత్సరంలో, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా నాల్గో ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే.