తప్పకుండా బరిలో ఉంటా.. బీజేపీకి బిగ్ షాకిచ్చిన సోయం బాపూరావు

by GSrikanth |
తప్పకుండా బరిలో ఉంటా.. బీజేపీకి బిగ్ షాకిచ్చిన సోయం బాపూరావు
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పకుండా ఆదిలాబాద్ లోక్‌సభ బరిలో ఉంటానని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన ప్రకటన చేశారు. శనివారం బాపూరావు మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అయితే, ఏ పార్టీ నుంచి బరిలో ఉంటాననేది త్వరలో అధికారికంగా ప్రకటిస్తా అని వెల్లడించారు. అయితే, ఆదిలాబాద్ బీజేపీ టికెట్‌ను సోయం బాపూరావు ఆశించారు. అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీని కాదని.. పార్టీ అధిష్టానం గోడం నగేష్ అనే వ్యక్తికి టికెట్ కేటాయించింది. టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న సోయం బాపూరావు.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముగ్గురు సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం ఇచ్చి.. నాకేందుకు ఇవ్వలేదని అధిష్టానాన్ని ప్రశ్నించారు. టికెట్‌పై కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.

Advertisement

Next Story