- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'కేసీఆర్ సర్కార్‌లో ఆనందంగా ఆడబిడ్డ పెళ్లి'
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: కళ్యాణ లక్ష్మీ పథకం పేదల పాలిట వరమని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ కళాచక్రపాణి అన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ పాత్ర పోషిస్తూ కట్నంగా రూ.1,00,116 కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఇస్తున్నాడని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ పథకం వచ్చినాక ఆడపిల్లల పెళ్లిలకు ఆర్థికంగా దోహదపడుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఎప్పుడూ పేదల కోసమే పరితపిస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో ఇప్పటికీ 1100 లకు పైగా కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందించినట్లు తెలిపారు. 35 రోజులు జరిగిన 121 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను సంక్రాత్రి పండుగ సందర్భంగా అందిస్తున్నామన్నారు. చెక్కులు త్వరగా మంజూరయ్యేలా చేసిన మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని జిందం కళ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నరసయ్య, గ్రంధాలయ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మంచే శ్రీనివాస్, సెస్ డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.