ఏసీబీ అధికారుల రెక్కీ.. ఆఫీసర్లను గమనించి SI ఎస్కేప్?

by Rajesh |
ఏసీబీ అధికారుల రెక్కీ..  ఆఫీసర్లను గమనించి SI ఎస్కేప్?
X

దిశ, రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఏసీబీ దాడులు జరిగినట్లు తెలుస్తుంది. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి పట్టుకున్న ఓ ట్రాక్టర్ రిలీజ్ విషయంలో ఎస్సై బాధితులను డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ఓ మీడియేటర్ ద్వారా 25 వేలకు బేరం కుదిరినట్లు తెలుస్తుంది. అయితే బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఎస్సై రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు వ్యూహం రచించారు. అందులో భాగంగా మీడియేటర్ ద్వారా ఎస్ఐకి డబ్బులు ముట్ట చెప్పేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఠాణాకు వెళ్లారు.

అయితే స్టేషన్ బయట వాహనాలను గమనించిన ఎస్సై ఏసీబీ అధికారులు వచ్చారని గమనించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏసీబీ అధికారులు రెక్కీ నిర్వహించినప్పటికీ ఎస్సై ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేకపోయారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు మధ్యవర్తి ని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. కాగా ఎస్సై ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది తెలియాల్సి ఉండగా శుక్రవారం అర్ధరాత్రి రాయికల్లో ఏసీబీ అధికారుల రెక్కీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story