సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన కందిపప్పు ధర

by Prasanna |
సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన కందిపప్పు ధర
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ఏదయినా కొనాలన్నా భయంగా ఉంది.. తినాలన్నా భయంగా ఉంది ప్రస్తుతం అలాంటి రోజులు నడుస్తున్నాయి. రోజు రోజుకు అమాంతం పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యులకు చెమటలు పట్టిస్తున్నాయి. మొన్నటి వరకు ఉల్లి, టమాటా చేతికి కూడా అందలేదు తాజాగా ఇప్పుడు ఆ లిస్టులో కంది పప్పు కూడా చేరింది.

కంది పప్పు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని నిపుణులు కూడా చెబుతుంటారు. దీన్ని వారంలో 3 సార్లు కూడా తినేవారు ఉన్నారు. ఈ ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో కిలో పప్పు ధర రూ. 150-160 రూపాయలు ఉంటే, ఇప్పుడు ధర గణనీయంగా పెరిగింది. ఇప్పుడు కిలో కందిపప్పు ధర రూ.200కి చేరగా.. మార్కెట్ లో మాత్రం కిలో కంది పప్పును రూ. 220 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో వర్షాలు, దిగుబడి తగ్గడంతో రేట్లు పెరిగాయని అంటున్నారు. ముందు ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed