Delhi : ఆ రూల్స్ అమలుతో ఢిల్లీలో వాయు కాలుష్యానికి కళ్లెం

by Hajipasha |
Delhi : ఆ రూల్స్ అమలుతో ఢిల్లీలో వాయు కాలుష్యానికి కళ్లెం
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం(air pollution) తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ఈ తరుణంలో గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) ఢిల్లీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. వెంటనే ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -2’ (గ్రాప్-2) ను అమల్లోకి తేవాలని సిఫారసు చేసింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) పరిధిలో మొత్తం నాలుగు స్టేజీలు ఉన్నాయి. గ్రాప్-1 దశలో కాలుష్య నియంత్రణ కోసం 27 చర్యలను అమల్లోకి తేవాల్సి ఉంటుంది.

గ్రాప్-2 దశలో 11 చర్యలను చేపట్టాలి. గ్రాప్-3 దశలో 11, గ్రాప్-4 దశలో 8 చర్యలను తీసుకోవాలి. గ్రాప్-2 దశతో ముడిపడిన చర్యలను అమలు చేయాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఏక్యూఎం కోరింది. యంత్రాలతో రోడ్లను ఊడ్పించడం, వాతావరణంలో పొగమంచు అత్యధికంగా ఉండే సీజన్లలో యాంటీ స్మాగ్ గన్లను వినియోగించడం, డీజిల్ జనరేటర్ల వినియోగంపై ఆంక్షలు వంటి చర్యలను గ్రాప్-2లో భాగంగా చేపట్టాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్ ఛార్జీలను పెంచడం, బాణాసంచా నిల్వ, క్రయవిక్రయాలపై బ్యాన్ వంటి చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కారును సీఏక్యూఎం కోరింది.

Advertisement

Next Story

Most Viewed