ఆకలిని అణిచివేస్తున్న అధిక తీవ్రత వ్యాయామం..

by Sujitha Rachapalli |
ఆకలిని అణిచివేస్తున్న అధిక తీవ్రత వ్యాయామం..
X

దిశ, ఫీచర్స్ : అధిక వ్యాయామం ఆకలిని పెంచుతుందని చెప్తారు. భారీ వర్క్ అవుట్ సెషన్ తర్వాత శరీరం కేలరీలను బర్న్ చేస్తుంది. శక్తి నిల్వలను తగ్గిస్తుంది. బాడీ మరిన్ని కేలరీలను కోరుకోవడం మూలంగా.. మనకు ఆకలిగా అనిపిస్తుంది. పరిశోధకులు కూడా ఈ దృగ్విషయాన్ని ధృవీకరించారు. అయితే అధిక-తీవ్రత వ్యాయామం ఆకలిని పెంచడానికి బదులుగా అణచివేయగలదని కొత్త అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా స్త్రీలలో ఆకలి హార్మోన్ గ్రెలిన్ స్థాయిలు తగ్గుతాయని తేలింది.

ఇంతకుముందు పరిశోధన సాధారణంగా ఎసిలేటెడ్ గ్రెలిన్ (AG) అని పిలువబడే గ్రెలిన్ కు సంబంధించిన ఒక రూపం గురించి మాత్రమే వెల్లడించింది, అయితే ఈసారి పరిశోధన రెండవ రూపమైన డీసైలేటెడ్ గ్రెలిన్ (DAG) పై వెలుగునిచ్చింది. 'జర్నల్ ఆఫ్ ది ఎండోక్రైన్ సొసైటీ'లో ప్రచురించబడిన, అధ్యయనం ప్రకారం.. హై ఇంటెన్సిటీ వర్కవుట్ ఎసిలేటెడ్, డీసైలేటెడ్ గ్రెలిన్‌ను అణిచివేస్తుంది,. ఈ ప్రభావం పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎనిమిది మంది పురుషులు, ఆరుగురు స్త్రీలపై చేసిన అధ్యయనం ఈ ఫలితాలను వెల్లడించింది.

Advertisement

Next Story