వెదురు సారంతో జుట్టు మెరుపులు

by Sujitha Rachapalli |
వెదురు సారంతో జుట్టు మెరుపులు
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యవంతమైన జుట్టు ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తున్నారా? మార్కెట్లో లెక్కలేనన్ని ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ.. చాలా మంది నేచురల్ సొల్యూషన్ వైపు మొగ్గుచూపుతున్నారు. జనాదరణ పొందుతున్న అటువంటి పరిష్కారం వెదురు సారం. బలం, మన్నికకు ప్రసిద్ధి చెందిన ఈ వెదురు మొక్క.. జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన మినరల్ సిలికా సమృద్ధిగా ఉండటం వల్ల.. ఈ చెట్టు సారం జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, స్ప్లిట్స్ తగ్గించడానికి, వాల్యూమ్ పెంచడానికి సహాయపడుతుంది. మీ స్కాల్ప్‌ను పోషించే సామర్థ్యం నుంచి షైన్ అందిస్తూ చక్కగా మేనేజ్ చేస్తుంది.

ఇందుకోసం తలస్నానం చేశాక వెదురు సారాన్ని కొబ్బరి లేదా అవకాడో ఆయిల్ తో కలిపి తడి జుట్టుకు పట్టించండి. ముప్పై నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తలను శుభ్రం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టును హైడ్రేట్ చేస్తుంది. పెరుగుదలతోపాటు మెరుపు కూడా యాడ్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed