Cybercrime alert:బ్యాంకు ఖాతాలతో జరుగుతున్న సైబర్ మోసాలపై కేంద్రం హెచ్చరిక

by S Gopi |
Cybercrime alert:బ్యాంకు ఖాతాలతో జరుగుతున్న సైబర్ మోసాలపై కేంద్రం హెచ్చరిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఖాతాలను ఉపయోగించి అంతర్జాతీయ సైబర్ మోసగాళ్లు సృష్టించిన అక్రమ చెల్లింపుల గేట్‌వేలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం కీలక హెచ్చరిక చేసింది. మనీలాండరింగ్ వ్యవహారాల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలను, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకుని ఉపయోగిస్తున్నట్టు అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. షెల్ కంపెనీలు, ఇతరుల ఖాతాలను ఉపయోగించి మనీలాండరింగ్ సేవలందించే సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ చెల్లింపుల గేట్‌వేలను సృష్టించారని, బ్యాంకులు అందించే బల్క్ పే-ఔట్ సౌకర్యాన్ని వారు అక్రమాల కోసం వాడుతున్నారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎవరైనా సరే ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను లేదా కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా ఉద్యం ఆధార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను అమ్మడం, అద్దెకు ఇవ్వొద్దని హెచ్చరించింది. ఒకవేళ అలా ఎవరైనా ఇస్తే ఆయా బ్యాంకు ఖాతాలలో జమ చేసిన అక్రమ నిధుల వల్ల అరెస్ట్ సహా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చట్టవిరుద్ధమైన చెల్లింపుల గేట్‌వేలను ఏర్పాటు చేసేందుకు ఇటువంటి బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లను దుర్వినియోగం చేస్తున్నారని, అటువంటి వాటిని బ్యాంకులు తనిఖీ చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story