జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తా : ఎమ్మెల్యే కూనంనేని

by Kalyani |
జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తా  : ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ,కొత్తగూడెం: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, వారి చిరకాల వాంఛ ఇంటి స్థలం ఇప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు అన్నారు. శనివారం గంగా బిసన్ బస్తీలో గత పది రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యమాలకు తాను వ్యతిరేకం కాదు అని, ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. జర్నలిస్టు చేస్తున్న దీక్ష ఐక్యతను తీసుకు వచ్చిందని, ప్రభుత్వం జర్నలిస్టులకు భూమి ఇవ్వాలని అనుకున్న 10ఎకరాల 18గుంటల భూమికి చుట్టూ ఫెన్సింగ్ వేయించి బోర్డు పెట్టించే పని చేపడతానని, ఆ తర్వాత భూమి జర్నలిస్టు లకు ఎలా పంపిణి చేయాలనే అంశం పై కలెక్టర్ , యూనియన్ లకు అతీతంగా కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

అనంతరం జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడుతూ… మీలోని ఐక్యత , ఇలా అందరూ ఒకదగ్గర చేరడం చూస్తుంటే తనకు తను జర్నలిస్టు గా పని చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పి గత స్మృతులను పంచుకున్నారు. ఆ రోజుల్లో ఐదారుగురు మాత్రమే ఉండేవాల్లమని సమాజం , ప్రజల సమస్యల పై ఎప్పుడు చర్చించేవారమని తెలిపారు. ఇలాగే ఐక్యత కొనసాగాలని, భవిష్యత్ లో మీ అందరికీ ఇంటి స్థలం ఇచ్చి మీ కోరిక నెరవేర్చుతనని జర్నలిస్టులకు మరోసారి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, సీనియర్ పాత్రికేయులు జనుమాల రమేష్, నాగాచారి , కల్లోజి శ్రీనివాస్, డీవీ, రవీందర్, రవి, తారక్, వీరు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed