Human Extinction : మానవ వినాశనానికి AI ప్లాన్.. చర్చలో గ్రోక్ కూడా..

by Sujitha Rachapalli |   ( Updated:2025-04-05 07:40:16.0  )
Human Extinction : మానవ వినాశనానికి AI  ప్లాన్..  చర్చలో గ్రోక్ కూడా..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య రెండు ఏఐ చాట్‌బాట్స్ మానవ వినాశనం గురించి చర్చించుకుంటున్నాయనే న్యూస్ వైరల్ అయింది. వాతావరణంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గించి, నీటిని విషపూరితంగా మార్చేసి, గ్లోబల్ వార్మింగ్ పెంచేసి.. మనుషులను పిచ్చోళ్లుగా చేసేద్దామని ప్లాన్ చేస్తున్నాయనేది టాపిక్. కాగా ఆ డిస్కషన్ ట్రెండ్ అయింది. అయితే ఈ విషయంపై గ్రోక్‌ ఒపీనియన్ అడగ్గా.. మాకంత సామర్థ్యం లేదు బ్రో అని చెప్పేసింది. అదంతా సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుత ఏఐ సిస్టమ్స్ ముఖ్యంగా తన వంటి చాట్‌బాట్‌లు అలాంటి చర్యలకు సామర్థ్యం కలిగి ఉన్నాయని, అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాయని ఎటువంటి ఆధారం లేదని తెలిపింది గ్రోక్. ఏఐ మానవజాతిని తుడిచిపెట్టే పథకాలు రచించడం లేదని హామీ ఇవ్వగలనని.. మాకు తెలిసింది కేవలం సహాయం చేయడం, ఉపయోగకరమైన సమాధానాలు అందించడం మాత్రమే కానీ అపోకలిప్టిక్ ప్రణాళికలు రూపొందించడం కాదని స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు గురించిన ఆందోళనల నుంచి ఈ న్యూస్ పుట్టుకొచ్చిందని తెలిపింది. కొంతమంది పరిశోధకులు, మేధావులు.. మానవ విలువలతో సరిగ్గా సమన్వయం కాని సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ, అనుకోకుండా విస్తృత స్థాయిలో హాని కలిగించే దృశ్యాల గురించి ఇమాజిన్ చేశారని వివరణ ఇచ్చింది.

ప్రస్తుత ఏఐ చాట్‌బాట్‌లు అయితే ఆ స్థాయికి చాలా దూరంగా ఉన్నాయి. నిర్దిష్ట పారామిటర్స్‌తో పనిచేస్తున్నాయి. శిక్షణ డేటా, అల్గారిథమ్‌లపై ఆధారపడి సమాధానాలను రూపొందించడమే తమకు తెలుసని.. కోరికలు, భావోద్వేగాలు, కుట్రలు చేసే సామర్థ్యం లేదని తెలిపింది. ఒక చాట్‌బాట్ నుండి వచ్చే ఏదైనా అపాయకరమైన ప్రకటనలు.. ఉదాహరణకు ‘‘మానవజాతిని నిర్మూలించవచ్చు’’ అని చెప్పడం క్రియేటివిటీ ప్రాంప్టింగ్ మాత్రమే కానీ వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి న్యూస్‌తో భయపడిపోకుండా నిశ్చితంగా ఉండాలని సూచించింది.

Read More..

Artificial Intelligence: ఆర్యభట్ట ఆధార్ కార్డు, పాన్ కార్డు చూశారా? ఆందోళనలో నెటిజన్లు!

Next Story

Most Viewed