BigBasket: బిగ్‌బాస్కెట్ 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ

by S Gopi |
BigBasket: బిగ్‌బాస్కెట్ 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ధంతేరాస్ సందర్భంగా వినియోగదారుల కోసం టాటా సంస్థకు చెందిన బిగ్‌బాస్కెట్ వినియోగదారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించింది. జ్యువెలరీ రిటైల్ చెయిన్ సంస్థ తనిష్క్‌తో భాగస్వామ్యం ద్వారా బిగ్‌బాస్కెట్ కస్టమర్లకు బంగారు, వెండి నాణెలను కేవలం 10 నిమిషాల్లోపే డెలివరీ చేయనుంది. ఇరు కంపెనీల మధ్య సహకారం ప్రకారం లక్ష్మీ గణేష్(999.9 స్వచ్ఛత), వెండి నాణెం(10 గ్రా), తనిష్క్ 22 క్యారెట్ గోల్డ్ కాయిన్(1 గ్రా), లక్ష్మీ (1 గ్రా) నాణెలను ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ మెరుగైన సేవలందిస్తున్న తమకు తనిష్క్‌తో భాగస్వామ్యం మరింత విస్తరణకు అవకాశం లభించింది. దీని ద్వారా ఈ దీపావళికి బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి వాటిని కస్టమర్లకు 10 నిమిషాల్లోనే అందించనున్నామని బిగ్‌బాస్కెట్ చీఫ్ బయింగ్, మర్చండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ చెప్పారు.

క్విక్ కామర్స్‌లో పెరుగుతున్న పోటీ..

బంగారం, వెండి నాణేలను క్విక్ డెలివరీ చేసే ప్లాట్‌ఫారమ్ బిగ్‌బాస్కెట్ మాత్రమే కాదు ఇప్పుడు. బ్లింక్ఇట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా వాటిని 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ ద్వారా క్విక్ డెలివరీ సేవలకు, ప్రత్యేకించి పండుగల సీజన్‌లో పోటీతత్వాన్ని పెంచనుంది.

Advertisement

Next Story