- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE-MAINS : జేఈఈ మెయిన్స్ - 2025 షెడ్యూల్ రిలీజ్..
దిశ, నేషనల్ బ్యూరో : జేఈఈ మెయిన్స్ (2025-26) (JEE-MAINS) విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల షెడ్యూల్(EXAM SCHEDULE) విడుదలైంది. ఈ మేరకు జేఈఈ (మెయిన్) పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఉత్తర్వులు జారీచేసింది. కాగా, రెండు సెషన్లు(TWO SESSIONS)గా ఈ పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ సెషన్-1 జనవరి 2025లో జరగనుండగా.. సెషన్-2 ఏప్రిల్ 2025లో నిర్వహించనున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. జనవరి సెషన్‌కి సంబంధించి.. 2024 అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. సెషన్-1కు పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. వీటి ఫలితాలు ఫిబ్రవరి 12 లోగా విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్‌లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్-1(బీఈ, బీటెక్)ను ఎన్ఐటీ, ఐఐటీ, సీఎఫ్టీఐ, యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ బీఈ, బీటెక్ ప్రవేశాలకు నిర్వహిస్తారు. అలాగే, జేఈఈ మెయిన్ పేపర్-1 ను జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హతతో ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్స్ పేపర్-2తో బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
జేఈఈ మెయిన్ సెషన్-1 జనవరి 2025 షెడ్యూల్..
*ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పణ - 28 అక్టోబర్ నుంచి 22 నవంబర్ 2024
*ఫీజు చెల్లింపునకు చివరి గడువు - 22 నవంబర్ 2024
* పరీక్ష కేంద్రాల ప్రకటన - 2025 జనవరి తొలి వారంలోపు..
* అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ - పరీక్షకు 3 రోజులు ముందు విడుదల
* పరీక్ష తేదీలు - 2025 జనవరి 22 నుంచి 31వ తేదీ వరకు..
*ఫలితాలు విడుదల -ఫిబ్రవరి 12 లోపు..
మెయిన్ సెషన్-1 కు దరఖాస్తు చేసి ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఈ అప్లికేషన్ నెంబర్ పై సెషన్-2 దరఖాస్తుకు ఎన్టీఏ అవకాశం కల్పిస్తుంది. కానీ, ఫీజు చెల్లింపు తప్పనిసరి అని ఎన్టీయే పేర్కొ్ంది.