Blue Tea : బ్లూ టీ గురించి విన్నారా? రోజూ తాగితే బోలెడన్ని ప్రయోజనాలు

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-28 18:27:51.0  )
Blue Tea : బ్లూ టీ గురించి విన్నారా?  రోజూ తాగితే బోలెడన్ని ప్రయోజనాలు
X

దిశ, ఫీచర్స్ : శంఖపుష్పి అనేది శంఖపు షెల్ ఆకారంలో ఉండే నీలిరంగు పువ్వు. ఔషధ గుణాల కోసం ఆయుర్వేదంలో వినియోగించే ఈ విష్ణుక్రాంత పుష్పం.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మెదడును శాంతపరిచే సమ్మేళనాలను కలిగి.. సహజ ఒత్తిడి నివారిణిగా పని చేస్తుంది. దీన్ని టీ రూపంలో కూడా తీసుకుంటుండగా.. బ్లూ టీ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

ఒత్తిడిని తగ్గిస్తుంది

శంఖపుష్పి టీలో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ వంటి బలమైన యాంటిసైకోటిక్ ప్లాంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్యూర్ & అప్లైడ్ బయోసైన్స్ అధ్యయన నివేదిక ప్రకారం.. బ్లూ టీలో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి.

బాడీ పెయిన్ రిలీవర్

జంతువులపై నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్యూర్ & అప్లైడ్ బయోసైన్స్ అధ్యయనంలో .. శంఖపుష్పి టీ బాడీ పెయిన్స్ నివారించడంలో సహాయపడుతుందని కనుగొనబడింది. రుమాటిక్ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులతో సహా దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ

మూలికా శంఖపుష్పి టీ జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఈ బ్లూ చాయ్ జీర్ణక్రియకు అనుకూలమైన మొక్కల సమ్మేళనాలను కలిగి ఉండటం వల్ల జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం నుంచి ఉపశమనం అందిస్తుంది.

బ్రెయిన్ టానిక్

శంఖపుష్పి ఆకులలో ఉండే బలమైన సమ్మేళనాలు కన్ఫోలిన్, కన్వాల్విన్, ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. బ్లూ టీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శక్తిని మెరుగుపరచడంలో, మానసిక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed