- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Yemen: యెమెన్ లో కేరళ నర్సుకు శిక్ష.. స్పందించిన విదేశాంగ శాఖ
దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్(Yemen)లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియపై భారత విదేశాంగ శాఖ(MEA) స్పందించింది. శిక్ష పడకుండా ఉండేందుక నిమిషా ప్రియ కుటుంబం దారులు వెతుకుతోందని వెల్లడించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. నిమిషా ప్రియ కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు తన కూతుర్ని విడిపించడానికి యెమెన్ వెళ్లిన ప్రియ తల్లి ప్రేమ కుమారి.. హత్యకు గురైన కుటుంబంతో చర్చలు జరుపుతోంది. మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వారితో చర్చలు జరుపుతుంది.
అసలు కేసు ఏంటంటే?
ఇకపోతే, కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే మహిళ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్కక్తికి మత్తుమందు ఇచ్చి చంపింది. ఆమెను యెమెన్ కోర్టు దోషిగా తేల్చింది. . ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్‌లో జైలు శిక్ష అనుభవిస్తోంది. అయితే, ఆమెకు మరణ శిక్ష విధిస్తూ యెమెన్ అధ్యక్షుడు(Yemen President) రషద్ అల్ అలిమి నిర్ణయం తీసుకున్నారు. నెలరోజుల్లోగా ఆమెకు శిక్ష అమలు చేసే అవకాశం కన్పిస్తోంది. దీనిపైనే భారత విదేశాంగ శాఖ స్పందించింది.